
*పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ మహేష్ గుండెపోటుతో మృతి
* గతంలో వేములవాడ సిఐగా పనిచేసిన మాధవి భర్త మహేష్ బాబు
ఆకేరు న్యూస్ , కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ మహేష్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సతీమణి మాధవి ప్రస్తుత హుజురాబాద్ ఏసిపిగా పనిచేస్తున్నారు. హుజురాబాద్ లో తన భార్య ఏసిపి మాధవి వద్దకు వెళ్ళిన మహేష్ బాబు ఒక్కసారిగా గుండెపోటుకు గురి కావడంతో వెంటనే హుజరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోవడంతో ఏసిపి మాధవి తో పాటు పోలీస్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్సై నుంచి ఇద్దరు ఒకేసారి సిఐ గా డీఎస్పీగా ప్రమోషన్ పొంది పలుచోట్ల పనిచేసి ఫ్రెండ్లీ పోలీసుగా పలువురి మన్ననలు అందుకున్నారు. డీఎస్పీ మహేష్ బాబు మృతితో సిపి గౌస్ ఆలం తో పాటు పలువురు పోలీసు అధికారులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం సానుభూతి తెలిపారు. ఏసిపి మాధవిని ఓదార్చారు.
……………………………………….