* అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దీనిపై గతంలో ఇచ్చిన సూచనల ఆధారంగా త్వరగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సవిూపంలోనే భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా డ్రైపోర్ట్ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఆర్ఆర్ఆర్, జాతీయ రహదారులపై సీఎం సవిూక్ష నిర్వహించారు. ప్రత్యేకించి రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవిూక్షించారు.ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు సవిూక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపైనా సవిూక్షించిన సీఎం.. ఫ్యూచర్ సిటీ- వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, కేంద్రం అనుమతులపైనా సవిూక్షించిన సీఎం.. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు.
………………………….
