* మంత్రులు కొండా సురేఖ, సీతక్క
* మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు
* భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
ఆకేరున్యూస్, వరంగల్: ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వరంగల్ (తూర్పు)నియోజక వర్గ పరిధిలోని ఏంకే నాయుడు కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సహచర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా వివిధ కంపెనీలు జాబ్ మేళాలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను మంత్రులు, కలెక్టర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా మెగా జాబ్ మేళాను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ 65కి పైగా వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలన్నారు. వరంగల్ జిల్లా లో ప్రాధాన్య క్రమంలో నియోజక వర్గాల వారీగా జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మంత్రి వర్యులు ధననసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తం గా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్ పోశాల పద్మ కావేటి కవిత బైర బోయిన ఉమా బాల్నే సురేష్ బసవరాజు కుమారస్వామి ఫుర్కాన్ బల్దియా అదనపు కమిషనర్ జోనా జడ్ పి సి ఈ ఓ రామ్ రెడ్డి డి ఆర్ డి ఏ కౌసల్య సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి రాజేశ్వర్ ఏం హెచ్ ఓ డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
