* ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
ఆకేరున్యూస్, హైదరాబాద్: హనుమకొండలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు అనుమతులపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. హనుమకొండలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం విచారణ జరిగింది. ఆ సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని కోర్టుకు జీపీ తెలిపారు. వారం రోజుల్లో వరంగల్ సభ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సభ కోసం బీఆర్ఎస్ పెట్టుకున్న పర్మిషన్ను అనుమతించకపోవడం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే 17 లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21 కి వాయిదా వేసింది. అలాగే వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈనెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకు సభ నిర్వహిస్తామని గులాబీ పార్టీ పేర్కొంది. అయితే అందుకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. 17లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలంటూ విచారణను వాయిదా వేసింది.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
