* కావాలనే సచివాలయంలో కనుమరుగు చేశారు
* నేనే తెలంగాణ అన్నట్టుగా వ్యవహరించారు
* తెలంగాణ తల్లి విగ్రహం భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ అధికారంలో ఉండగా.. ఎక్కడైనా తెలంగాణ తల్లి విగ్రహం (TELANGANA THALLI STATUE) పెట్టిందా? అని సీఎం రేవంత్ రెడ్డి (CHIEF MINISTER REVANTHREDDY) ప్రశ్నించారు. నేనే తెలంగాణ.. తెలంగాణ అంటే నేనే అన్న చందంగా గత పాలకులు ప్రవర్తించారని, కావాలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో కనుమరుగు చేశారని విమర్శించారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 60 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత్రి సోనియా (SONIA) నెరవేర్చారని తెలిపారు. భూమి పూజ ఘనంగా చేయాలనుకున్నామని, దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో చేశామని వెల్లడించారు. డిసెంబర్ 9న తెలంగాణ విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహిస్తామని, అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమం విజయవతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. కాగా, సచివాలయం ప్రాంగణంలో విగ్రహ నిర్మాణం కొనసాగుతుంది. డిసెంబర్ 9న విగ్రహం ఆవిష్కరించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ (MP ANILKUMAR YADAV), మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి (MINISTER KOMATIREDDY VENKATREDDY), కే.కేశరావు (K. KESAVARAO), మేయర్ విజయలక్ష్మి (MAYOR VIJAYALAKSHIMI), ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
—————————————————————