* బీదర్, పద్మావతీ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దుండగుల హల్ చల్
* సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపిన దొంగలు
ఆకేరు న్యూస్, ఖమ్మం : బుధవారం అర్ధరాత్రి దొంగలు రైళ్లల్లో హల్ చల్ చేశారు. మచిలీపట్నం నుంచి బీదర్ వెళుతున్న బీదర్ ఎక్స్ ప్రెస్ (Bidar Express), తిరుపతి నుంచి సికింద్రాబాద్ కి వెళుతున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ (Padmavati Express) రైళ్లలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లాలోని దొంగలు నాగులవంచ-చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్ నీ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపారు. మొదటగా అర్ధరాత్రి 12 గంటల సమయం దాటాక వచ్చిన బీదర్ ఎక్స్ ప్రెస్ రైలును ఆపి 4 రిజర్వేషన్ బోగిల్లోకి ఎక్కారు. ఆ తరువాత ఒకటి తరువాత అదే మార్గం లో వచ్చిన పద్మావతీ ఎక్స్ ప్రెస్ ను సైతం దొంగలు అదే ప్రాంతంలో ఆపి ఎక్కారు. రైళ్ళో గాఢ నిద్రలో ఉన్న కొందరి ప్రయాణికుల మెడలోని 25 తులాల బంగారు గొలుసులు, మరికొందరి దగ్గరి నుండి 25 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఖమ్మంకు బదిలీ చేశామని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ మజీద్ తెలిపారు. రైల్వే ఎస్పీ సలీమా, వైరా ఏసీపీ రెహ్మాన్, సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు..
——