
*సీతక్క చేస్తున్న అభివృద్ధితో ఉనికిని కోల్పోతామనే భయం
* జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
ఆకేరు న్యూస్ ములుగుః మంత్రి సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై దుష్ప్రచారాలు మానుకోవాలని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ సూచించారు.బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా మంత్రి సీతక్క మీద, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు,నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.ములుగు జిల్లాలో ఎన్నడు లేని విధంగా అభివృధి జరుగుతుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు నియోజకవర్గంలో ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు చేశామన్నారు. ములుగులో మోడల్ బస్ స్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు,మల్లంపల్లి మండలం ఏర్పాటు,ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు,మంగపేటలో బస్ స్టాండ్ నిర్మాణం చేశామన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే,మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గం కోసం అదనంగా 1500 వందల ఇళ్లు అదనంగా మంజూరు చేయించారని తెలిపారు. ఇప్పటికైనా సీతక్కపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………