* కరీంనగర్లో ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరబాద్ : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2023లోనే కరీంనగర్లో టీటీడీ ఆలయానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. 2023 మే 31న 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగిందని వివరించారు. కానీ, ఆలయ నిర్మాణం రెండేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. టీటీడీ ఆలయ (TTD Temple) నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, పనులను యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మీ నేతృత్వంలో టీటీడీ దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో ముందుండడం, ఆలయాల నిర్మాణానికి సహకరిస్తుండడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను మీరు ఆదుకోడం అభినందనీయమని, అలాగే రెండేళ్లుగా కరీంనగర్(Karimnagar)లో ఆగిపోయిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
…………………………………………………
