
* కోచ్ ప్యాక్టరీని సందర్శించనున్న కిషన్ రెడ్డి,అశ్వినీ వైష్ణవ్
ఆకేరు న్యూస్ , వరంగల్ : రేపు వరంగల్‌కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ,బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డిలు రానున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కాజీపేటలోని అయోధ్యపురంలో ఉన్న
రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. కాజీపేట నుంచి నేరుగా రాజస్థాన్ కు కొత్త రైలును ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రుల వెంట సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ రానున్నారు.
……………………………….