* యూపీఎస్సీ ఫలితాలు విడుదల
- దోనూరు అనన్యా రెడ్డి -03 ,
- నందల సాయికిరణ్, -27 ,
- మెరుగు కౌశిక్ -82 ,
- రావుల జయసింహారెడ్డి -104
-
* 1143 పోస్టులకు 1016 మంది ఎంపిక..
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : యూపీఎస్సీ (UPSC ) ఫలితాలు మంగళ వారం విడుదలయ్యాయి. మొత్తం 1016 మంది ఉత్తీర్ణులయ్యారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2023 ఫలితాల్లో 1016 మంది ఉత్తీర్ణుల యూపీఎస్సీ వెల్లడించింది. ఈసారి తెలుగు విద్యార్థులు గణనీయమైన ఫలితాలు సాధించారు. 2023 మే 28న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు.. ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ సీఎస్ఈ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈసారి జనరల్ విభాగంలో -347, ఓబీసీ -303, ఈడబ్ల్యూ ఎస్ -115, ఎస్సీ-165, ఎస్టీ-86 మంది ఆయా విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఇదిలాఉంటే 1143 ఖాళీలకు నోటిఫికేషన్లు ప్రకటించగా, 1,106మంది ఉద్యోగానికి అర్హత సాధించడం విశేషం. మొత్తం మూడు విడతల్లో 2848 మంది అధికారులు అభ్యర్థులకు ఇంట ర్వ్యూలు నిర్వహించారు. వీరిలో 1016మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు.
* తెలుగు రాష్ట్రాల సివిల్ ర్యాకర్లు వీరే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు గణ నీయమైన ర్యాంకులు సాధించారు.
- దోనూరు అనన్యా రెడ్డి -03 ,
- నందల సాయికిరణ్, -27 ,
- మెరుగు కౌశిక్ -82 ,
- రావుల జయసింహారెడ్డి -104
- పెంకీసు ధీరజ్ రెడ్డి -173 ,
- జీ అక్షయ్ దీపక్ -196,
- లక్ష్మీ అన్నపూర్ణ -198 ,
- నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి -382,
- బన్న వెంకటేశ్ -467 ,
- కడుమూరి హరిప్రసాద్ – 475,
- పూల ధనుష్ – 480,
- కే శ్రీనివాసులు -526,
- నెల్లూరు సాయితేజ- 558,
- కిరణ్ సాయింపు -568 ,
- మర్రిపాటి నాగ భరత్ -580 ,
- పొతుపు రెడ్డి భార్గవ్ -590 ,
- వద్యావత్ యశ్వంత్ నాయక్ -627,
- కే అర్పిత – 639 ,
- నెల్లిశ్యామల ఐశ్వర్య -649 ,
- సాక్షీ కుమారి- 679,
- చౌహాన్ రాజ్ కుమార్ – 703 ,
- గాదే శ్వేత -711,
- ధనుంజయ్ కుమార్ -810,
- భానోత్ లక్ష్మీ – 828 ,
- ఆదా సందీప్ కుమార్-830 ,
- జే రాహుల్ -873,
- హనిత వేములపాటి- 887,
- శశికాంత్ కే- 891 ,
- కేసారపు మీనా – 899,
- రావూరీ సాయి అలేఖ్య -938 ,
- గోవధ నవ్యశ్రీ – 995 .
ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు ర్యాంకులు సాధించిన వారికి స్వయంగా అభినందనలు తెలియజేస్తున్నారు.104 వ ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డి ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు.
——————————–