అమెరికాలోని న్యూ జెర్సీలో బోనాల పండుగ సంబురాలు
* న్యూజెర్సీలో ఘనంగా జాతర
ఆకేరు న్యూస్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాలోనూ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, పోతరాజులు, పట్టు చీరల్లో ఆడపడుచులు, పసుపు బోనాలతో ఊరేగింపులతో న్యూజెర్సీ సందడిగా మారింది. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు జరుపుకుంటున్న వేళ.. ఆదివారం సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకూ జాతర నిర్వహించారు. “మన తెలుగు అమెరికా సంఘం” నిర్వాహకులు ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను.. న్యూజెర్సీలోని 1665-370 ఓక్ ట్రీ రోడ్డులోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జేలో.. కన్నుల పండువగా నిర్వహించారు. అచ్చమైన తెలంగాణ బోనాలను తలపించేలా.. డప్పు చప్పుళ్లతో బోనాల ఊరేగింపు, ఈరగోలలతో పోతరాజులు చేసే విన్యాసాలు, అమ్మవారి పాటలకు చిన్నాపెద్ద నృత్యాలు చేస్తూ.. బోనాల జాతరను ఎంతో కోలాహలంగా కొనసాగించారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
