* అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నారు..
* మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్, మోదీ సంతకాలు పెట్టారంటూ కొలంబస్, వాస్కోడిగామా లాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక పత్రం పట్టుకొచ్చి, కొన్ని పదాలు డిలీట్ చేసి చదివారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. నాడు రైతుల పొలాల్లో మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, కేంద్రం ఇచ్చే రూ. 30 వేల కోట్ల గ్రాంటును కూడా వదులుకున్నామని తెలిపారు. అసెంబ్లీలో హరీశ్‌రావు కేవలం ఉదయ్ పథకం గురించి చెప్పారని, ఈ పథకంలో 27 రాష్ట్రాలు చేరాయి. ఈ పథకం డిస్కలం ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకొచ్చారు. ఉదయ్ పథకంలో మా కంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత మేం కూడా చేరాం.. సీఎం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు… అంటూ జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు.