
* కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆకస్మిక మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. వాటికి, కరోనా వ్యాక్సిన్ కు సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఐసీఎంఆర్(ICMR), ఎయిమ్స్ (AIIMS)అధ్యయనం చేశాయని వెల్లడించింది. యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్.. ప్రధాన కారణంగా అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించినట్లు వివరించారు. అంతేకాకుండా అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవనశైలి, జన్యుపరమైన సమస్యల వల్లే ఎక్కువగా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని వివరణ ఇచ్చింది. మరణాలకు వ్యాక్సిన్లే కారణమనే ప్రచారం తప్పు అని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది.
…………………………………………..