Vaibhav Suryavanshi made his international debut for India at just 15 years and 99 days
* ఇంగ్లాండ్తో రెండో టీ20లో అరంగేట్రం..
* భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్: భారత క్రికెట్లో కొత్త చరిత్ర నమోదైంది. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు(VAIBHAV SURYAVANSHI DEBUT).
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో అతడికి అవకాశం లభించింది.
తిలక్ వర్మ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్న వైభవ్.. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డు సృష్టించాడు.
సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాడిపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
A historic day for Indian cricket 💙
Vaibhav Sooryavanshi makes his #TeamIndia debut at 1️⃣5️⃣ years, 9⃣9⃣ days 👏#ENGvIND pic.twitter.com/qwS2hx4RW8
— BCCI (@BCCI) July 4, 2026
* చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు
ఐపీఎల్లో తన దూకుడు ఆటతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఆ తర్వాత ఇండియా-ఏ తరఫున కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జాతీయ జట్టులోకి ప్రవేశించి (VAIBHAV SURYAVANSHI DEBUT) తన ప్రతిభకు మరో మైలురాయిని జోడించాడు. అంత చిన్న వయసులో భారత జెర్సీ ధరించడం ఒక్కటే కాదు.. కోట్లాది మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచే ఘనతను కూడా అందుకున్నాడు.
* భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
