
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరున్యూస్, నల్గొండ: పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలు ఇక స్క్రాప్‌కి పోవాల్సిందేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు, తెలంగాణ రాష్ట్రం వాహన సారధిలోకి ఎంట్రీ అయిందని పొన్నం తెలిపారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో కలిసి పొన్నం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఇక ముందు వాహనాలకు సంబందించిన ఫిట్ నెస్,పొల్యూషన్ వంటి వాటిని వాహన సారధిలో చూసుకోవాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. ఏఐ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు వస్తున్నాయని మంత్రి తెలిపారు. డ్రైవింగ్ సెంటర్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు పొందాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆటోమెటిక్ టెస్టంగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.
…………………………………………..