
* షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజీనామా చేసిన నేపధ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది, ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 7 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22న నామినేషన్ల పరిశీలన ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. సెపె్టంబర్ 9 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
……………………………………..