Mahabubabad Bathroom Video Harassment
* బాత్రూమ్ వీడియోల వేధింపులు
* బాధితులపై ఎస్ఐ దూషణలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
పాఠశాలలో బాత్రూమ్కు వెళ్లే సమయాల్లో దొంగతనంగా వీడియోలు తీసి వేధిస్తున్నాడని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, అక్కడ బాధితులకు తీవ్ర అవమానం ఎదురైన ఘోర ఉదంతం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో వెలుగు చూసింది. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, న్యాయం చేయాల్సిన రక్షక భటుడే నిందితుడి కొమ్ము కాస్తూ తమను తీవ్రంగా దూషించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
దంతాలపల్లి మండల పరిధిలోని ఒక పాఠశాలలో పని చేస్తున్న బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా తమను తీవ్రంగా వేధిస్తున్నాడు. తాము పాఠశాలలో పని చేస్తున్న సమయంలో రహస్యంగా పర్సనల్ వీడియోలు, అలాగే బాత్రూమ్కు వెళ్తున్న దృశ్యాలను రికార్డు చేసి తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేక, బాధితులు ధైర్యం చేసి ఈ నెల 1వ తేదీన దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవికుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
* నిందితుడి ముందే అవమానం:
ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ రవికుమార్, బాధితులకు న్యాయం చేస్తామని నమ్మబలికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తీరా స్టేషన్‌కు వెళ్లిన తర్వాత, తమను వేధిస్తున్న నిందితుడు నరేష్ సమక్షంలోనే ఎస్ఐ తమ పట్ల అత్యంత నీచంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడి ముందే తమను ఘోరంగా దూషిస్తూ, మానసికంగా కుంగదీసేలా అవమానించారని కన్నీటిపర్యంతమయ్యారు.
* బాధితుల డిమాండ్…
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ బాత్రూమ్ వీడియోలు తీసి మూడేళ్లుగా వేధిస్తున్న నరేష్‌పై, అలాగే బాధితులమని తెలిసి కూడా స్టేషన్లో అవమానకరంగా ప్రవర్తించిన ఎస్ఐ రవికుమార్‌పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
