RTC Retired Employees Protest
* భారీ సంఖ్యలో రోడ్డెక్కిన విశ్రాంత ఉద్యోగులు
* డిమాండ్ల సాధన కు ధర్నా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ బస్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం అధిక సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు అక్కడకు చేరుకున్నారు. తమకు రావాల్సిన బెన్ఫిట్స్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చలో బస్‌భవన్ కు పిలుపునివ్వడంతో భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లవరకు బకాయి పడిందని, వాటిని ఇప్పించాలని కోరారు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి సుమారు రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందని వెల్లడించారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం రవాణాశాఖ మంత్రికి, ఆర్టీసీ ఎండీలకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అన్నారు. వృద్ధాప్యంలో కూడా ఆందోళనలు చేయాల్సి వస్తోందని వాపోయారు. కాగా, బస్‌భవన్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
* రిటైర్డ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొన్ని..
* రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు, ఆగిన లీవ్ ఎన్క్యాష్మెంట్లు ఇవ్వాలి.
* గ్రాట్యుటీ, ఆఖరు నెల జీతం ఇవ్వాలి.
* 2013 పీఆర్సీ ఏరియర్స్‌కు సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను వెంటనే పీఎఫ్ కమిషనర్ కార్యాలయానికి పంపాలి.
* 2017, 2021 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
* విశ్రాంత ఉద్యోగులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
* తార్నాక ఆసుపత్రిలో గతంలో మాదిరిగా రెండు నెలల మందులు ఇవ్వాలి.
* ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే దహన సంసారాల సహాయాన్ని రూ.30 వేలకు పెంచాలి.
* ఎస్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం కల్పించాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
