Amber Kishore Jha
* క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు!
* నార్లపూర్ (మేడారం) పోలీస్ స్టేషన్,
* డీఐజీ అంబర్ కిశోర్ ఝా
ఆకేరు న్యూస్, ములుగు: పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా సోమవారం ములుగు జిల్లాలో పర్యటించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నార్లపూర్ (మేడారం) పోలీస్ స్టేషన్‌తో పాటు ములుగు సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్తో పాటు ఇతర అధికారులు డీఐజీకి స్వాగతం పలికారు.
తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా (Malkhana), ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరును డీఐజీ పరిశీలించారు. సిబ్బంది విధి నిర్వహణ, క్రమశిక్షణ, యూనిఫాం, టర్న్అవుట్ (Turnout) తదితర అంశాలను సమీక్షించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి వారి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాల పనితీరును పరిశీలించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేసేందుకు సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్ (Visible Policing), నిఘా పెట్రోలింగ్ (Patrolling), కమ్యూనిటీ పోలీసింగ్ (Community Policing)కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీఎన్ఎస్ 2.0 (CCTNS 2.0), ఈ-సాక్ష్య (e-Sakshya), డిజిటల్ ఫోరెన్సిక్స్ (Digital Forensics), సైబర్ దర్యాప్తు (Cyber Investigation), సోషల్ మీడియా మానిటరింగ్ (Social Media Monitoring) వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించాలని, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నార్లపూర్ పోలీస్ స్టేషన్, ములుగు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, పస్రా సీఐ దయాకర్, నార్లపూర్ ఎస్ఐ కమలాకర్, ములుగు సీఐ సురేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: మహా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శ్రేణులు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

