Vijay Sethupathi
* విజయ్ సేతుపతి సినిమాకు హాలీవుడ్ రీమేక్..
* లీడ్ రోల్లో ఆస్కార్ విజేత?
ఆకేరు న్యూస్, సినిమా:
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌ను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి.
హాలీవుడ్ రీమేక్
‘మహారాజ’ ఇంగ్లీష్ రీమేక్ హక్కులను ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ సొంతం చేసుకున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ రీమేక్ కోసం పలువురు హాలీవుడ్ ఏ-లిస్ట్ నటులతో చర్చలు జరుగుతున్నాయని నిర్మాత సుధాన్ సుందరం తెలిపారు.
మాథ్యూ మెక్కోనాహే పేరు
విజయ్ సేతుపతి పోషించిన తండ్రి పాత్ర కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్కోనాహే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘ఇంటర్స్టెల్లార్’, ‘డల్లాస్ బయ్యర్స్ క్లబ్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయనతో పాటు పలువురు నటులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తుది నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గ్లోబల్ సక్సెస్
‘మహారాజ’ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా చైనా మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. అక్కడ థియేటర్లలో ఏడు రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ గ్లోబల్ విజయంతోనే హాలీవుడ్ రీమేక్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
