cm revanth reddy
* సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ
* మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీపై చర్చలు
Telangana Investments: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ ఆసక్తి చూపింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమైంది.
పెట్టుబడులపై చర్చ
అసెంబ్లీ చాంబర్లో జరిగిన భేటీలో తెలంగాణలో విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాలను సీఎం వివరించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
సెమీకండక్టర్ పరిశ్రమ
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలో హైటెక్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం లభించే అవకాశం ఉంది.
మూసీ, ఫ్యూచర్ సిటీపై వివరాలు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, మూసీ రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం ప్రతినిధులకు వివరించారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీని నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలను కూడా వివరించారు.
డిసెంబర్లో నిర్వహించనున్న Telangana Rising Global Summitకు ఆగస్టీన్ లీతో పాటు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, సింగపూర్ అధికారులు డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, విలియం చిక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
