ACTOR VIJAY TAMILNADU CM
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, నటుడు మరియు తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో దూసుకువచ్చిన విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
* గవర్నర్‌తో భేటీ..
బుధవారం చెన్నైలోని లోక్ భవన్లో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ కీలక సమావేశంలో, తనకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ గవర్నర్‌కు తెలియజేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అందిన 5గురు ఎమ్మెల్యేల మద్దతు లేఖ కూడా ఉన్నట్లు సమాచారం.
* మెజారిటీ నిరూపణపై గవర్నర్ ఆరా…
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతానికి విజయ్ వద్ద 113 మంది మద్దతు ఉండటంతో, మిగిలిన సంఖ్యను ఎలా సమీకరిస్తారని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన టీవీకే చీఫ్, తనకు ఇతర చిన్న పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
* ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్..
గవర్నర్ సానుకూలంగా స్పందించడంతో, మే 7 లేదా 8 తేదీల్లో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే విజయ్ నేరుగా పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ‘సీఎం విజయ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
