
*చైన్నైలో తమిళగ వెట్రి కళగం కార్యవర్గ సమావేశం
* సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును అధికారికంగా ప్రకటించిన పార్టీ
* ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ప్రకటన
* ప్రజలకు మరింత చేరువ కావాలని నిర్ణయం
ఆకేరు న్యూస్ డెస్క్ ః తమిళగ వెట్రి కళగం స్థాపకుడు స్టార్ హీరో విజయే కాబోయే సీఎం అని ఆ పార్టీ ప్రకటించింది. శుక్రవారం చెన్నైలో విజయ్ అధ్యక్షతన తమిళగ వెట్రి కళగం పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ సభ్యులందా కలిసి కీలకైన నిర్ణయం తీసుకున్నారు. 2026 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయ్ ని సీఎం అభ్యర్థిగా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంతగా పార్టీనిప్రజల్లోకి తీసుకెళ్లాలనే నిర్జ్ఞం తీసుకున్నారు. దానికి కావాల్సిన కార్యచరణను రూపొందించి ప్రణాళికా బద్దంగా ముందుకు పోవాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన కామెంట్లను పార్టీ ఖండించింది. తమిళనాడులో హిందీ భాషను బలవంతంగా రుద్దితే ఊర్కునేది లేదని పార్టీ హెచ్చరించింది. ఎలక్టోరల్ రివిజన్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యతిరేకించింది. తమిళనాడులో మైనారిటీ ఓట్లను తగ్గించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీవీకే ఆరోపించింది.
………………………………………..