* కలకలం సృష్టిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు
* కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్(FOOD POISION)0 ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న వికారాబాద్ జిల్లా(VIKARABAD DISTRICT) తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లా(JAGITYALA DISTRICT)లో పలు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందా? లేదా మరే కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
………………………………………