రోడ్డు ప్రమాదం (ఫైల్ ఫోటో)
* ఇద్దరు మృతి.. ఏడుగురికి గాయాలు
* టైరు పేలడంతో అదుపుతప్పిన కారు
ఆకేరు న్యూస్ వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vikarabad Road Accident Today) చోటుచేసుకుంది. బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతాపూర్ వద్ద ఆదివారం ఉదయం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* టైరు పేలడంతో అదుపుతప్పిన కారు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతాపూర్ వద్ద ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.
* ఇద్దరు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు..
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీశైలంతో పాటు బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే (Vikarabad Road Accident) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలించారు.
* కేసు నమోదు చేసిన పోలీసులు..
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

