* అసలేం జరుగుతోంది..
* ఘటనపై అనుమానాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎక్కడికెళ్లినా అతడిని పాము కాటేస్తోంది (Snake bite). ఊరుమారినా మారడం లేదు. పాముకాటేసినప్పుడు ఆస్పత్రిలో చేరుతున్నాడు.. ఒకరోజు ఉండి డిశ్చార్జి అవుతున్నాడు. అసలేం జరుగుతోంది.. నిజంగా పాము కాటేస్తుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. యూపీ (Uttar Pradesh) కి చెందిన వికాస్ దూబే (Vikas Dubey) అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవలే 35 రోజుల్లో 6 సార్లు పాముకాటుకు గురయ్యాడు. అయితే గురువారం మరోసారి పాము అతన్ని కాటు వేసింది. ఎక్కడికి వెళ్లినా పాము వెంటాడుతుండటంతో బాధితుడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాము తనను 9 సార్లు కాటేస్తానని కలలో చెప్పిందని, వికాస్ చెప్పడం షాక్‌కి గురి చేస్తోంది. ఆఖరు కాటుకు తాను చనిపోతానని పాము తనతో అన్నట్లు బాధితుడు చెబుతున్నాడు. ఇప్పటికే 7సార్లు పాము కాటుకు గురైన వికాస్ ధూబే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి మాట్లాడుతూ.. ఒకే వ్యక్తిని 7సార్లు పాము కాటేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
—————————