ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Union Steel Minister Kumaraswamy) విశాఖ (Visakha) లో పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ (Steel plant) పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ప్రైవేటీకరణ (Privatization)కు చర్యలు సాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి రివ్యూ (Union Minister Review) పై ఉద్యోగులు, కార్మికులలో సర్వత్రా ఆసక్తినెలకొంది.
విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Industry) ప్రైవేటీకరణ (Privatization) జరగకుండా చూస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ (AP) లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. గత మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Privatization of steel plant) నిర్ణయంపై కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్రం ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్ పై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న ఆసక్తి ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ దేశంలో నెలకొంది. ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు చేరుకున్న కేంద్ర మంత్రి కుమార స్వామి, మరికాసేపట్లో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలు నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంతో విశాఖ ఉక్కు భవిష్యత్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సంస్థ నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి, కేంద్రమంత్రి రాకతో పరిస్థితి మారుతుందా? సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.
—————————-