Wajedu Bridge Flood
* పెరుగుతున్న గోదావరి వరద
* డైవర్షన్ రోడ్డుకు ప్రమాదం
ఆకేరు న్యూస్, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం ఇసుకవాగు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి డైవర్షన్ రోడ్డుకు వరద ముప్పు పొంచి ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో డైవర్షన్ రోడ్డుపై నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.
ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగించే 18 గ్రామాల ప్రజలు రహదారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరదల సమయంలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
