
ఆకేరున్యూస్, వరంగల్: విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఆదివారం వరంగల్లో 180మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.