Girl Suicide Attempt (File Photo)
* వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం..
* ముగ్గురిపై ఫిర్యాదు..!
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నం (Girl Suicide Attempt) చేసిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుగ్గొండి ప్రాంతానికి చెందిన బాలిక నల్లబెల్లిలోని హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 24న ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నర్సంపేటకు చెందిన ముగ్గురు యువకులు తనను ప్రేమించాలని వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి.
* పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఎంజీఎంలో చికిత్స
యువకుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, అర్ధరాత్రి సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Girl Suicide Attempt) యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వేధింపులకు పాల్పడిన యువకులపై విచారణ చేపట్టారు.
Also Read : దారుణం..14 ఏళ్లుగా కార్మికుల బానిస బతుకులు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

