Warangal Police Commissioner
Warangal Lok Adalat: అకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగా మొత్తం 8,288 కేసులు పరిష్కారమయ్యాయి.
1,595 ఎఫ్ఐఆర్ కేసులు పరిష్కారం
పరిష్కరించిన కేసుల్లో 1,595 ఎఫ్ఐఆర్ కేసులు, 2,171 ఈ-పెట్టీ కేసులు, 4,522 మోటార్ వెహికల్ చట్టం కేసులు, 134 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి. రాజీ మార్గంలో కేసులు పరిష్కారం కావడంతో ఇరు వర్గాలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు త్వరితగతిన న్యాయం అందే అవకాశం కలిగింది.
సైబర్ బాధితులకు రూ.93.30 లక్షల ఊరట
సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన నగదులో రూ.93,30,616 బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైబర్ మోసాలకు గురైన బాధితులకు భారీగా ఊరట లభించనుంది.
పోలీస్ అధికారులకు కమిషనర్ అభినందనలు
‘రాజీ మార్గం రాజా మార్గం’ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికారులకు కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని రాజీ కేసులను పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
