Clay Ganesh idols distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని 14వ వార్డు కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య పిలుపునిచ్చారు.
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఆదివారం మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని కోరారు. సిలికాన్, ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, రిజర్వాయర్లలో నీటి కాలుష్యం ఏర్పడి చేపలు, ఇతర జలచరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
ప్రజలు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో గడ్డాల శేఖర్, గట్టు సురేందర్, లత, అశోక్, పద్మ, కొంగరి రమేష్, వల్లాల పల్లవి, నిర్మల, సౌమ్య, రుద్రమదేవి, రమ, పెండ్యాల నరసయ్య, రాజమ్మ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
