Hyderabad Rapido Bike Accident by RTC bus
* యువతి అక్కడికక్కడే మృతి..
* లైవ్ క్యామ్ ఫుటేజ్ వైరల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ర్యాపిడో బైక్పై ప్రయాణిస్తున్న 26 ఏళ్ల హేమదుర్గను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ర్యాపిడో బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలైన హేమదుర్గ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన లైవ్ క్యామ్ ఫుటేజ్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
