* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే *నాయిని*
ఆకేరు న్యూస్, వరంగల్ : సీతారాముల కల్యాణం ప్రతి ఇంటికి శుభశాంతులు తీసుకురావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అర్చకులు వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకను తిలకించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. లోక కళ్యాణార్థం జరిగే సీతారాముల కల్యాణం ప్రతి ఇంటికి శుభాలు తీసుకురావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని శ్రీ సీతారామచంద్రులను వేడుకునట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
