Published:
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌గా (ఆర్ ఎం) బాధ్యతలు నిర్వహిస్తున్న దర్శనం విజయభాను బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయభాను స్థానంలో ప్రస్తుతం ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. భవాని ప్రసాద్ వరంగల్ రీజనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ ఈ మేరకు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. విజయభానుపై వచ్చిన కొన్ని ఆరోపణల నేపథ్యంలోనే ఈ బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో జరుగుతోంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
