
* 20 ఏళ్లుగా చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్న దత్తాత్రేయకు శుభాకాంక్షలు
* మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బండారు దత్తాత్రేయ 20 ఏళ్లుగా చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (VENKAYYANAIDU) కొనియాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలయ్-బలయ్ (ALAY-BALAY)అంటే అందరూ సోదరులంగా, బంధువులం, ఒకరితోమరొకరు కలిసి ఉండానలే సందేశం ఇస్తోందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్అతిథిగా విచ్చేశారు. దేశంలో కులం,మతం, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇండియాలో అలాంటి అవకాశం లేదని గుర్తు చేశారు. ఈ దేశంలో వేష, భాషలు వేరైనా మనమంతా భారతీయులం అనే భావనతో ముందుకెళ్తామన్నారు. అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
……………………………………….