
* 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది
* సాయంత్రంలోగా కొలిక్కి వస్తుంది
* మంత్రి దామోదర రాజనర్సింహ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సిగాచి కంపెనీ పేలుడు ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ చేపడుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ (DAMODARA RAJANARASIMHA) తెలిపారు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని, మృతదేహాల్లో 18 గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని వెల్లించారు. మిగిలిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి, డీఎన్ ఏ (DNA) పరీక్షలకు పంపామన్నారు. 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని, సాయంత్రంలోగా కొలిక్కి వస్తుందని వివరించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(MAHESH KUMAR GOUD), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (MINAKSHI NATARAJAN) ప్రమాద ఘటనను సందర్శించారు.
………………………………………