* హన్మకొండ సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెంకటరమణ
ఆకేరున్యూస్, హన్మకొండ: రాబోయే వేసవికాలానికి విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రకాల ముందస్తుచర్యలు తీసుకుంటున్నామని హన్మకొండ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.వెంకటరమణ తెలిపారు. ఇందులో భాగంగా నేడు హనుమకొండలోని న్యూ శాయంపేట సబ్ స్టేషన్లో 5 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ నుండి 8 యంవీయే పవర్ ట్రాన్స్ఫార్మర్ కు పెంచామని అన్నారు. ఇది వరకు 8 యంవీయే పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఇది అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీంతో మొత్తం 16 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెరిగిందని చెప్పారు. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెంచడం వలన వేసవిలో లోడ్ ఎంత పెరిగిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా తీసువల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ టౌన్ డిఈ జి. సాంబరెడ్డి, ఏడిఈ పి. మల్లికార్జున్, జానకి రాంరెడ్డి, దర్శన్ కుమార్, ఏఈ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………