* కాల్వబాట లో ఎర్రబెల్లి హెచ్చరిక
* రైతులతో మాటా ముచ్చట
* బీఆర్ ఎస్ హయాంలో చెరువులు మత్తళ్లు పోశాయి
* కాంగ్రెస్ రాగానే కష్టాలు మొదలయ్యాయి
ఆకేరు న్యూస్, జనగామ: రైతులకు సాగునీరు ఇవ్వకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని దేవాదుల కాల్వల వెంట కాల్వబాట నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను పలకరించారు. రైతులు సాగునీటి కోసం పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలకుర్తి మండలం శాతపురం క్రాస్ రోడ్స్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా సాగునీటి జలాలు అందించామని అన్నారు. రైతులు వద్దనెంత వరకు చెరువులు దేవాదుల, ఎస్ ఆర్ ఎస్ పి కాల్వల తో నింపామని అన్నారు. చెరువులు మత్తల్లు పోసి పాకూరు పట్టాయని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే సాగునీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. చెరువులకు కాల్వలు లేకున్నా అన్నాడు చెరువులు నింపిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు ఇప్పటిదాక మీటింగ్ పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు. మాదాపూర్, అనేక తండా లలో పొలాలు ఎండిపోయాయని, రైతులు అరిగోస పడుతండ్లు అని అన్నారు. కాంగ్రెస్, నేతలు కార్యకర్తలు కూడా సాగునీరు లేకపోవడం తో బాద పడుతుండ్లు అన్నారు. వారంరోజుల్లో కాల్వలకు నీళ్ళు వదలాలని అన్నారు. సిఎం , ఉత్తం కు చెప్తన్న… నీళ్ళు వదలాలి… ఈ ప్రాంతమంతా ఎడారి అవుతుంది. ప్రాజెక్టు లను నీళ్లతో నింపి చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ వి బ్రోకర్ మాటలు.. ఆయన మాయల మాటలకు జనాలు మోసపోయారు… అబద్దాల మాటలతో సీఎం అయ్యిండు.. సాగునీరు కోసం srsp కాల్వతో నీళ్ళు మైలారం, కొడకండకు, దేవాదుల నీళ్ళ తో పాలకుర్తి, పెద్ద వంగర దేవరుప్పుల మండలాలకు సాగునీరు విడుదల చేయాలన్నారు ఇంకా మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలి.. నవాబుపేట రిజర్వాయర్ను నీళ్లతో నింపాలి పాలకుర్తి నియోజకవర్గం లోని అన్ని చెరువులకు, కుంటలకు వారం రోజుల్లో సాగునీరు విడుదల చేయాలి.. లేకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేద్దామని పాలకుర్తి రైతాంగమంతా కదిరి రావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అడ్డుకున్న రైతులు ధర్నాకు రావాల్సిందేనని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం లేదు. రూ.2500, రుణమాఫీ, రైతుబందు, బొనస్ ఎగ్గొట్టాడని విమర్శించారు. కరెంట్, నీళ్ళు రావడం లేదని, కేసీఆర్ చేసిన పనులు చేస్తే చాలని అన్నారు. సమావేశంలో మాజీ జెడ్పిటిసిలు మంగళంపల్లి శ్రీనివాస్, పుష్కూరి శ్రీనివాసరావు, రంగు కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీలు నల్ల నాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, నాయకులు పసునూరి నవీన్ కుమార్ ,తీగల దయాకర్, పల్ల సుందరరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

……………………………………….
