* మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లకు బెదిరింపులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కలెక్టరేట్లకు బాంబు బెదిరింపు(Bomb threat)లు వచ్చాయి. మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లకు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ బెదిరింపులుగా తేల్చారు. మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఓవర్సీస్ ఇమెయిల్ ద్వారా కలెక్టరేట్(Collecterate)లో బాంబు ఉంచినట్లు దుండగులు హెచ్చరించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్(Dog Squad)తో కలిసి కలెక్టరేట్ పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు.అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
………………………………………
