ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా (Hanumakonda District) లోనే రెండో అతిపెద్ద చెరువు అయిన కమలాపూర్ (Kamalapur) చెరువు కట్ట, మత్తడి మరమ్మతులకు గాను 17 లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే చెరువు కట్ట, మత్తడి పనులను పూర్తి చేయటానికి ఇరిగేషన్ అధికారులు (Irrigation authorities) సిద్ధంగా ఉన్నారని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు(MPDO Gunde Babu) అన్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో కమలాపూర్ పెద్ద చెరువు త్వరత్వరగా నిండుకుంటున్న దృష్ట్యా కమలాపుర్ పెద్ద చెరువు, మత్తడిని ఇరిగేషన్ ఇంజనీర్ అనిల్ రెడ్డి, ఎంపీడీవో గుండె బాబు బుధవారం పరిశీలించారు. పెద్ద చెరువుకు సంబంధించిన కట్ట బలోపేతంగానే ఉందని, చెరువు మత్తడి దగ్గర పడిన గండిని త్వరితగతన పూర్తి చేయుటకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని ఎంపీడీవో తెలిపారు. కమలాపూర్ చెరువు మత్తడి గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. గతంలో ఈ మత్తడి ప్రాంతంలో కాంక్రీట్‌తో మరమ్మతులు చేసినప్పటికీ అది కొట్టుకుపోయింది. ప్రస్తుతానికి మత్తడికి పడ్డ గండీని తాత్కాలికంగా పూడ్చి వేస్తామని, హుజరాబాద్, చిన్న పాపయ్య పల్లె ప్రాంతాల నుండి కమలాపూర్ పెద్ద చెరువుకు వచ్చే ఇన్‌ఫ్లోలో ఎక్కువ భాగం నీటిని ఉప్పల్ పెద్ద చెరువుకు మళ్లించినట్టు ఇరిగేషన్ అధికారి అనిల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
——————–