
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, మెదక్ : బీజేపీ తో బీ ఆర్ ఎస్ కుమ్ముక్కైందని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా దోమకొండ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో మెదక్ జిల్లా నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌజ్ లో టిఫిన్ చేసేందుకు ఆగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రమేష్ కే టీ ఆర్ తనతో మాట్లాడిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాను అన్నారు కదా దానిపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని సీతక్క ప్రశ్నించారు. బీ జే పీ తో కుమ్మక్కు కావడం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ లు రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎంపీ ఎన్నికల్లో రాకపోవడం గమనించాలన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ అబద్ధాల మీద ఆధార పడి కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అభివృద్ధికి సహకరించాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని సీతక్క హితవు పలికారు.
……………………………………..