* జడ్జిల్లా వ్యవహరించొద్దు
* కనీసం 15 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి
* బుల్డోజర్ల కూల్చివేతలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తుండడంపై సుప్రీంకోర్టు(SUPREMCOURT) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిష్పాక్షమైన విచారణ పూర్తి కాకుండానే జడ్జిల్లా నిర్ణయించేసి.. నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం సరికాదని పేర్కొంది. ఆయా ప్రభుత్వాలు కూల్చివేతల్లో తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అని పేర్కొంది. తొలుత ఉత్తరప్రదేశ్(UTTARPRADHESH)లో, తర్వాత పలు రాష్ట్రాల్లో మొదలైన ఇళ్ల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెల్లడించింది. షోకాజ్ నోటీసులు(SHOWCAUSE NOTICE) జారీ చేయకుండా ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని సూచించింది. కనీసం 15 రోజుల ముందుగానే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కూల్చివేతల ప్రక్రియను వీడియోతో చిత్రీకరించాలని చెప్పింది. అసలు కూల్చివేతలే ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని అధికారులు వివరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
…………………………………..