* ప్రజల ప్రాణాలపై కూడా దృష్టి పెట్టరా
* సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: అందాల పోటీలకే కాదు సామాన్య ప్రజలకు కడా రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కెటిఆర్ పెర్ అయ్యారు. అందాల పోటీల విూద పెట్టే ఖర్చు.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సోమవారం అగ్ని ప్రమాద ప్రదేశానికి వెళ్లి కెటిఆర్ పరిశీలించి బాధితులను ఓదార్చారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెప్తున్నారన్నారు. పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు కాదు.. రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
