* సినీ ఫక్కీలో మర్డర్ ప్లాన్
* బైక్ పై వెళ్తున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య
* హత్యను రోడ్డు ఆక్సిడెంట్‌గా చిత్రించే ప్రయత్నం
* పోలీసుల అదుపులో నిందితులు
ఆకేరున్యూస్, భువనగిరి : యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి
ఓ మహిళ తన భర్తను సినీ ఫక్కీలో చంపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన ప్రియుడు, తన తమ్ముడితో పాటు సుఫారీ మనుషుల సహాయంతో
భర్తను సినీ ఫక్కీలో హత్యచేయించింది. హత్యను రోడ్డు ప్రమాద ఘటనగా చిత్రించే ప్రయత్నం చేసింది. తన భర్త స్వామి బైక్ పై వెళ్తుండగా కారులో వెంబడించి కారుతో బైక్‌ను బలంగా ఢీకొట్టించడంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.. రోడ్డుపై పడి ఉన్న స్వామిపై నుండి మళ్లీ కారును నడిపినట్టుగా పోలీసులు తెలిపారు. తన భర్తను చంపడానికి కారును అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు తెలిసాయని పోలీసులు తెలిపారు. మహిళతో పాటు ఆమె తమ్ముడిని ఈ హత్యలో మహిళకు సహాయం చేసిన సుఫారీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….
