- సంక్షేమం పేరుతో ప్రజలను ఉక్కు సంకెళ్ళలో బందీ చేస్తే ఊరుకోరు.
- సామాజిక సమతుల్యత పాటిస్తున్నాం..
- ఈటల రాజేందర్ చిల్లర మల్లర ఆరోపణలు ఆపేయాలి.
- నాటు.. నాటు పాట బలగం సినిమాలు ప్రభుత్వ నిర్ణయాలు కాదు.
- ధరణి ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ నిర్వహణకు అప్పగించాం .
మీట్ ద మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి (C M Revanth reddy )
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ప్రభుత్వాన్ని పడగొడుతారా..? నా తడాఖా చూపిస్తా ..బీఆర్ ఎస్ , బీజేపీ పార్టీలు కుమ్మక్కయి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. చూస్తూ ఊరుకోలేం.. కదా..కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు .. అదే పాటిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడిగా ఇక నా పని మొదలు పెడతా.. ఇప్పటికే మొదలైందని (బీఆర్ ఎస్ పార్టీ నుంచి వలసలను దృష్టిలో పెట్టుకుని ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద మీడియా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సుదీర్ఘంగా మాట్లాడారు. మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము చేరికలు అనే విధానానికి పోకుండా పరిపాలన అందించాం. ప్రతిరోజు టిఆర్ఎస్ ,బిజెపి వాళ్లు మీ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కుట్రలు చేస్తున్నారు
విడివిడిగా చూసినా , కలిపి చూసినా కూడా బీజేపీ ( BJP) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేదు. మాజీ మంత్రి కడియం శ్రీహరి నుంచి మాజీ సీఎం కేసీఆర్ వరకు బీఆర్ ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారు. మరో వైపు బీజేపీ రాజ్య సభ సభ్యులు బీజేపీ ఓబీసీ జాతీయ నాయకుడు లక్ష్మణ్ అంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ఏదో రూపంలో రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని అర్ధమవుతుందన్నారు.. మరీ చూస్తూ ఊరుకోలేం కదా.. అందుకే ఇక పార్టీ నాయకుడిగా నా పని మొదలు పెట్టానని రేవంత్ రెడ్డి అన్నారు. - సంక్షేమం పేరుతో ప్రజలను ఉక్కు సంకెళ్ళలో బందీ చేస్తే ఊరుకోరు.
సంక్షేమం, అభివృద్ధి పేరుతో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన తన వారసులకు కూడా అప్పగించాలని కలలు కన్నాడు. ప్రజలు ఎర్రజెండా నీడలో తిరుగుబాటు చేశారు. 1948 సెప్టెంబర్ 17 నిజాం నవాబును గద్దె దించిన రోజు .. నిజాం అడుగుజాడలో నడుస్తూ కేసీఆర్ తెలంగాణ ప్రజలు కట్టు బానిసలుగా భావించారు. తన వారసులకు తెలంగాణను అప్పగించాలనుకున్నారు. ప్రజలు తిరగబడి 2023 డిసెంబర్ 3న నయా నిజాం నుంచి విముక్తి పొందారు.. అప్పటి సెప్టెంబర్ 17 కు ఎంత ప్రాధాన్యత ఉందో కేసీఆర్ ను గద్దె దిచిన డిసెంబర్ 3 వ తేదీకి కూడా అంతే ప్రాథాన్యత ఉందన్నారు. - సామాజిక సమతుల్యత పాటిస్తున్నాం..
గత ప్రభుత్వ నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వ నియామకాలకు తేడా గమనించాలి. తప్పని సరిగా సామాజిక సమతుల్యత పాటిస్తున్నాం .. సీఎంవో, మంత్రివర్గం , ఎంఎల్సీలు ఇతర అధికారులను సైతం సామాజిక సమతుల్యత పాటించే నియమించాం. వంద నిర్ణయాలు తీసకున్నప్పుడు దాంట్లో ఒక పదింటిని పేర్లు సెపరేట్ చేసి చూడడం సరియైంది కాదన్నారు. - అవినీతి పరులను వదిలిపెట్టేది లేదు.
అక్రమాలకు పాల్పడ్డ వాళ్లని ఎవరిని వది లేది లేదు. ఇంతకు ముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు గాని తెలంగాణ ప్రజలకు తెలవదు. ఈరోజు రాష్ట్రం నలుమూలల జరుగుతున్న దాడులు చూస్తున్నారు కదా.. అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యూడిషల్ ఎంక్వయిరీ చేసి జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినవి .
కళ్ళ ముందు ఏకే 47 తుపాకీతో వందల మందిని పొట్టన పెట్టుకున్న కసబ్ లాంటి వాళ్ళను ఉరి తీయడానికి ఎంత విచారణ జరిగిందో చూశాం కదా.. అవినీతిపరులశిక్షించడానికి ఏం తొందరలేదు. ఏం తొందర లేదు పారదర్శకమైన విచారణ చేస్తాం బాధ్యులైన వాళ్లందర్నీ శిక్షిస్తాం
తాగు , సాగు నీళ్ళపై ప్రత్యేక దృష్టి ..
గత ఏడాదిలో వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు. పవర్ జనరేషన్ గాలికి వదిలేశారు. పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పని చేయలేదు. లైన్మెన్లు కావాలనే విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్పించారు. అదీ గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు.
- ధరణి ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ నిర్వహణకు అప్పగించాం .
ధరణిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. గతంలో
ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉండేది. దాన్ని ప్రభుత్వం పర్యవేక్షణకు అప్పగించాం. ధరణి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేశాం. పోర్టల్ లో ఉన్న సమస్యలేంటి .. ? అపుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటి..? రెండింటిని సెపరేట్ చేసి సమస్యలను గుర్తిస్తున్నాం. కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక రెండున్నర లక్షల అప్లికేషన్లు మధ్యకాలంలో ఎమ్మార్వోలకు, ఆర్డీవోలకు, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చాం. వాళ్ళ చేత అన్ని ఎమ్మార్వో ఆఫీస్ లలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేశాం. ఆ సమస్యలు పరిష్కరించే పనిలో ఉన్నాం. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చిందని రేవంత్ చెప్పారు. - నిరుద్యోగులకు కాదు, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలివ్వాలన్న సోయి కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓటమి పాలయిన కవిత, వినోద్ రావుకు వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించారు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పడం భావదారిధ్ర్యం . నిరుద్యోగులకు ఇవ్వాలన్న సోయి లేదు. బాధ్యతారహితంగా గాలికి వదిలేశారు. కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ ఉద్యోగావకాశాలను కల్పించాం.. పొరపాట్లు జరిగినప్పుడు తప్పించుకునేందుకు టీఎస్పీఎస్సీ స్వతంత్ర సంస్థ మాకేమీ సంబంధం అనేవారు. ఇపుడు ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళకెట్లా సంబంధం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గ్రూప్ 1కు సంబందించి 44 ఏండ్ల నుంచి 46 ఏళ్ళ వయోపరిమితికి పెంచాం. ఇక పెంచే అవకాశం లేదని స్పష్టం చేశారు. - ఈటల రాజేందర్ చిల్లర మల్లర ఆరోపణలు ఆపేయాలి.
ఫోన్ టాపింగ్ చేసే అవకాశం లేనే లేదు. ప్రభుత్వం చేస్తోందని చిల్లర మల్లర ఆరోపణలు చేసే ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం వల్ల టీవీల్లో స్క్రోలింగ్ వస్తుందేమో కాని ఎలాంటి ప్రయోజనం ఉండదు.కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కదా. విచారణకు ఆదేశించమనండి . ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలిసిందే కదా.. కరీంనగర్లో వాళ్ళ మిత్రుడికి సంబందించిన ఏడు కోట్లు ఫోన్ టాపింగ్ వల్ల పట్టుకున్నామని అనుకుటుంటున్నారో ఏమో అలాంటిదేమి లేదు. పక్కా సమాచారం మేరకే కరీంనగర్లో పోలీసులు డబ్బులు పట్టుకున్నారన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తామన్నాను.
ఆర్ ఎస్ ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్నవాడు . కేసీఆర్ ఏం మాయ చేశాడో తెలియదు. పూర్వ కాలంలో వాలి తో యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళిన వారి స సగం బలం గుంజకుంటాడని విన్నాం .. కేసీఆర్ కూడా అలాంటి వాడే.. ప్రవీణ్ కు కూడా అలానే జరిగిందేమో.. సర్వీస్‌లో ఉంటే డీజీపీ అయ్యేవాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఆఫర్ ఇచ్చాను. 15 రోజులు అందుకే చైర్మన్ నియామకం ఆలస్యమయింది. ఇపుడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో చేరుతున్నారంటే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన పట్ల నాకు గౌరవం ఉందన్నారు
రైతు భరోసా పట్ల ఆందోళన అవసరం లేదు.
రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుబంధును ఇప్పటివరకు ఐదేకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి వాళ్ళ ఖాతాలో పడింది . భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు , రోడ్లు, లేఅవుట్లై బంగ్లాలకు కూడా ఇచ్చేవారు.
వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. రైతుబంధు లబ్ధిదారులను డేటా మొత్తం మా దగ్గర ఉంది .
ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ల పేరు మీదనే వస్తుంది. ఇట్లాంటి న తప్పుడు విధానాలకు రైతుబరోసా పథకంలో పులిస్టాప్ పెడతాం. వివిధ దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలను గుర్తించి అందుకు తగిన శిక్షణ కూడా ఇస్తుందన్నారు. కాళేశ్వరానికి సంబందించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ వచారణ జరుపుతోంది. దాని నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలుంటాయన్నారు. కేసీఆర్‌కు అధికారం కోల్పోవడమే పెద్ద శిక్ష . ఇంకా ఏం శిక్ష వేయమంటారో చెప్పండి ఆలోచిద్దాం అంటూ విలేకరులను నవ్వుతూ అడిగారు.
- రియల్ ఎస్టేట్ ఎన్నికల సమయంలో స్థబ్ధత ఉంటుంది.
ఎప్పడైనా ఎన్నకల సమయంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ స్థబ్ధతగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో నగదు బదిలీలు ఎక్కువగా ఉంటాయి. అమ్మకాలు ,కొనుగోల్లు మందగిస్తాయి. ఇదీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకందరికీ తెలుసు.