
ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన మహిళా సాధికారత, చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టబోవు కార్యక్రమాలు అనగా వడ్డీ లేని రుణాలు, ఎంటర్ప్రైజెస్ పెట్టడం సోలార్ విద్యుత్, ఫంక్షన్ హాల్ ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాంటీన్ ల నిర్వహణ, మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమాలను ఈ సంబరాల్లో వివరిస్తున్నారు. విజయోత్సవాలల్లో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో వీవోఏలు, సీసీలు, గ్రామ సంఘ అధ్యక్షులు, మండల సమాఖ్య సభ్యులు, ఏపిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంటర్ప్రైజెస్ లో సాధికార కార్యక్రమాలలో ప్రతిభ చూపించిన మహిళలకు సన్మానం చేశారు.
……………………………………….