
* రాజకీయాల్లో ఉనికి కోసమే బీసీ జపం
* రేపు కాంగ్రెస్ సమ్మేళనానికి ఖర్గే
* టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Maheshkumar Goud) విమర్శించారు. రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మేళనానికి గ్రామ, మండల, జిల్లా అధ్యక్షులు సమ్మేళనానికి హాజరవుతారని అన్నారు. సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (Kharge) దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు. ఈసందర్భంగా కవిత లేఖ, విమర్శలపై ఆయన స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో బీసీల రిజర్వేషన్ల గురించి కవిత ఒక్కసారైనా మాట్లాడారా అని అన్నారు. రాజకీయాల్లో ఉనికి కోసమే కవిత (Kavitha) బీసీ జపం చేస్తురన్నారని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడబోమని, అందరిపైనా చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా, బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్తమ్ అన్న.. చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు, కరెంటు కట్ చేయండని అప్పుడే ఆంధ్ర పాలకులు మన వద్దకు వస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
…………………………………………………………….