Yash Rashmika Comment
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
కన్నడ స్టార్ హీరో యశ్ తన వ్యక్తిత్వం, తనపై వచ్చే వ్యాఖ్యల విషయంలో స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు. గతంలో నటి రష్మిక మందన్న చేసిన కామెంట్‌పై స్పందిస్తూ, ఇతరుల అభిప్రాయాలు తన వ్యక్తిత్వాన్ని మార్చలేవని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2017లో ఓ ఇంటర్య్వూలో రష్మిక యాశ్ ను ఉద్దేశించి మిస్టర్ షో ఆఫ్ అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు బదులిచ్చారు. ఒక నటుడిగా తన ప్రయాణంలో ఎన్నో రకాల అభిప్రాయాలు, ప్రశంసలు, విమర్శలు ఎదురవుతుంటాయని అన్నారు. అయితే వాటిని బట్టి తన ఆలోచనా విధానాన్ని లేదా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
* ఒకరి గురించి మరొకరు మాట్లాడటం సహజమే
రష్మికతో తనకు మంచి పరిచయం ఉందని, ఆమె వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదనే భావనను యశ్ వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఒకరి గురించి మరొకరు మాట్లాడటం సహజమేనని, అయితే తాను తన పని, తన లక్ష్యాలపైనే దృష్టి పెడతానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం యశ్ తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. దీంతో యశ్‌కు సంబంధించిన ప్రతి వ్యాఖ్య కూడా సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
* పది రోజుల్లో థియేటర్లలోకి టాక్సిక్
ఆగస్టు 26 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తన తదుపరి చిత్రం రామాయణలో రావణుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 8 రిలీజ్ కానుంది. పార్ట్ 2 ..2007 దీపావళికి మేకర్స్ విడుదల చేస్తామని ప్రకటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
