* సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
* పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్
ఆకేరున్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని.. ఈ స్కూల్లో 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయని తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో ఈ స్కూల్ నిర్మాణం చేపట్టామని.. ఇందుకోసం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నాలుగో తరగతి నుండి 12వ తరగతి వరకు 2000 మంది విద్యార్థులు చదుకోవచ్చన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసామని.. ఈ స్కూల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ తోపాటు పలు రకాల కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పవర్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………….